Sunday, May 5, 2024

మోదీ విధానాల వ‌ల్లే సమస్యలు.. అవ‌స‌ర‌మైతే ఢిల్లీ వరకు యాత్ర : సీఎం కేసీఆర్

ధాన్యం కోనుగోలులో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వ‌ద్ద జరుగుతున్న టీఆర్ఎస్ మ‌హాధ‌ర్నాలో కేసీఆర్ ప్ర‌సంగించారు. హైద‌రాబాద్ లో మొదలైన ఈ ఉద్య‌మం ఇక్క‌డితో ఆగ‌దని, అవ‌స‌ర‌మైతే ఢిల్లీ వ‌ర‌కు యాత్ర చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుందన్నారు. తెలంగాణ పోరాటాలు, విప్ల‌వాల గ‌డ్డ‌ అని త‌న‌ను తాను ర‌క్షించుకోవాల‌నో తెలినిన గడ్డ అని అన్నారు. ప‌రాయి పాల‌కుల విష కౌగిలి నుంచి బ‌య‌ట‌ప‌డి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నామన్నారు. తెలంగాణ రైతాంగానికి అశ‌నిపాతంలాగా కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు దాప‌రిస్తున్నాయని మండిపడ్డారు. దేశాన్ని పాలించే నాయ‌కులు వితండ‌వాదాలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ప్ర‌భుత్వ‌మే ధ‌ర్నాకు కూర్చుంటుందా ? అని ప్ర‌శ్నించారని పేర్కొన్నారు. 2006లో నాటి గుజ‌రాత్ సీఎం మోదీ 51 గంట‌లు సీఎం హోదాలో ధ‌ర్నాకు కూర్చున్నారని గుర్తు చేశారు. సీఎంలు, మంత్రులు ధ‌ర్నాలో కూర్చునే ప‌రిస్థితి మోదీ విధానాల వ‌ల్ల‌నే వ‌చ్చిందన్నారు. కేంద్రం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తే ధ‌ర్నాల అవ‌స‌రం ఉండ‌దన్న కేసీఆర్.. ఈ పోరాటం భ‌విష్య‌త్‌లోనూ కొన‌సాగుతోంది స్ప‌ష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement