Monday, April 29, 2024

దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ జ‌లాభిషేకం

యాదాద్రిలో మ‌హా కుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వం నేత్ర‌ప‌ర్వంగా కొన‌సాగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ చేసి పండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు. 7 గోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏక‌కాలంలో కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. రాజ గోపురాల‌పై స్వ‌ర్ణ క‌ల‌శాల‌కు 92 మంది రుత్వికుల‌తో సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. విమాన గోపురాల శిఖ‌రాల‌పై క‌ల‌శ సంప్రోక్ష‌ణ కైంక‌ర్యాలు నిర్వ‌హించారు.

మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వం త‌ర్వాత ప్ర‌ధానాల‌య ప్ర‌వేశ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. తొలుత ఉపాల‌యాల్లోని ప్ర‌తిష్ఠామూర్తుల‌కు మ‌హాప్రాణ‌న్యాసం చేయ‌నున్నారు. తొలి ఆరాధ‌న సంప్రోక్ష‌ణ త‌ర్వాత గ‌ర్భాల‌యంలో స్వ‌యంభువుల ద‌ర్శ‌నం ప్రారంభం కానుంది. సంప్రోక్ష‌ణ త‌ర్వాత గ‌ర్భాల‌యంలో ప్ర‌థ‌మారాధ‌న‌, ఆర‌గింపు చేప‌ట్ట‌నున్నారు. గ‌ర్భాల‌యంలో తీర్థ‌, ప్ర‌సాద గోష్ఠి నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement