Thursday, May 2, 2024

కరోనా విలయం.. వైద్య శాఖలో ఉద్యోగాలు

తెలంగాణలో కరోన కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వైద్య శాఖలో అవసరమైన ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా 114 ఆస్పత్రులకు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 144 మంది డాక్టర్లు, 527 మంది నర్సు లు, 84 మంది ల్యాబ్ టెక్నీషియన్లతో కలిపి మొత్తం 755 పోస్టులను సీఎం మంజూరు చేశారు. తద్వారా రూ. 9.02 కోట్ల భారం రాష్ట్ర ఖజానా పై పడనుంది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా…స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఇంటర్వూలు నిర్వహించనున్నారు. అర్హులైన సిబ్బంది నియామకాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement