Sunday, April 28, 2024

‘విక్ర‌మ్’ చిత్రంలో హైలెట్ గా క్లైమాక్స్

విశ్వ నటుడు క‌మ‌ల్ హాస‌న్ సొంత బ్యాన‌ర్ లో భారీ బ‌డ్జెట్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని లోకేశ్ క‌న‌గ‌రాజ్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఈ చిత్రానికి విక్ర‌మ్ అనే టైటిల్ ని పెట్టారు. ఈ మూవీలో విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. తన ఆపరేషన్ లో భాగంగా ఆయన కొన్ని సందర్భాల్లో నెగెటివ్ షేడ్స్ లోను కనిపిస్తారని అంటున్నారు. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకూ హీరో – విలన్ ఎదురుపడకుండా ఇద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ నడుస్తుందట.ఇక ఈ ఇద్దరూ కూడా క్లైమాక్స్ లో ఎదురుపడతారు. అప్పుడు ఇద్దరి మధ్య చోటుచేసుకునే యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సినిమా అంతా ఒక ఎత్తు .. ఈ క్లైమాక్స్ ఒక ఎత్తు అని టాక్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement