Sunday, April 28, 2024

గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ఇకపై ఈజీగా సిలిండర్..

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఓవైపు గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటున్న వేళ.. కొత్త నింబంధనలు అమలులోకి వచ్చాయి. ఇది ఎల్‌పీజీ సిలిండర్ వాడే వారికి  ఊరటనిచ్చే విషయం. ఇకపై మీకు నచ్చిన గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్‌కు మీరు మారే అవకాశాన్ని కల్పించారు.

కొంత మంది సిలిండర్ బుక్ చేసి చాలా రోజులు అయినా కూడా సిలిండర్ ఇంటికి రాదు. ఇలాంటి వారు ఇకపై ఇబ్బంది పడాల్సిన పని లేదు. వారి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌ను మార్చుకోవచ్చు. వేరే డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందొచ్చు. ఇలా నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

ఈ మేరకు ఇండియన్ ఆయిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ పొందొచ్చని తెలిపింది. మీ డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకొని గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా సులభంగా సిలిండర్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement