Sunday, May 5, 2024

బిరుదుతో సత్కరించిన చికాగో తెలుగు అసోసియేషన్

యాంకర్ సుమకు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసు 50కి చేరువ అవుతున్నా కూడా ఇప్పటికీ యాంకర్‌లలో ఆమెదే అగ్రస్థానం. సుమకు తెలుగులో మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా అభిమానులు ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా సుమ అంటే క్రేజ్ ఉంది. అందుకే అప్పుడప్పుడూ ఫారెన్ టూర్స్ వెళ్లినపుడు సుమ క్రేజ్ చూసి అక్కడున్న వాళ్లు కూడా షాక్ అవుతుంటారు.

ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఆధ్వర్యంలో యాంకర్‌ సుమ కనకాలతో ‘సుమతో సందడి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా నలుమూలలా ఉన్న మహిళలతో ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో యాంకర్‌ సుమ పాల్గొని తనదైన శైలిలో సెటైర్లు వేసి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఈ సందర్భంగా ట్రై-స్టేట్ అసోసియేషన్ తెలుగు ప్రజల తరఫున సుమకు ‘సకల కళాభినేత్రి’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. 64 కళల్లో వినోదం ఒక కళ అయితే, వినోద పరచడంలో అరవై నాలుగు కళలను ప్రదర్శించే సుమకు ఈ బిరుదు ఇవ్వటం గౌరవ ప్రదంగా భావిస్తున్నామని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement