Monday, April 29, 2024

మియాపూర్ పీఎస్ లో రాంగోపాల్ వర్మపై చీటింగ్ కేసు

ఓ వ్య‌క్తి ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకొని.. ఇవ్వ‌క‌పోగా బెదిరించాడ‌ని ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై హైద‌రాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. గతంలో శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ రూ.56 లక్షలు తీసుకున్నారు. అప్పు తీర్చమని అడిగితే డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నడాని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించాడు. దీంతో వర్మపై సోమవారం మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దిశ సినిమా కోసం వర్మ తన వద్ద అప్పు చేసినట్టు బాధితుడు ఆరోపించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోగా బెదిరించాడని ఫిర్యాదు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement