Wednesday, December 6, 2023

స‌లార్ చిత్ర యూనిట్ కి షాక్ – షూటింగ్ స్పాట్ నుండి ఫొటోస్ లీక్

రాధేశ్యామ్ అట్ట‌ర్ ప్లాప్ గా నిలిచింది. ఈ చిత్రం త‌ర్వాత స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రం స‌లార్. ఈ చిత్రం హిట్ట్ పై ప్ర‌భాస్ అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కాగా నేడు ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. కాగా మొద‌టి రోజే షూటింగ్ లొకేష‌న్ నుండి ఫొటోస్ లీక్ అయ్యాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నాడు.. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో యూనిట్ లోని ఒకరు షూటింగ్ స్పాట్ నుంచి ప్రభాస్ పిక్స్ ను లీక్ చేశారు. ప్రభాస్ కూర్చున్న ఫొటోలు.. ఓ అమ్మాయితో మాట్లాడుతున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే సలార్ సెట్ కు సంబంధించిన పిక్స్ ను కూడా లీక్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీక్డ్ పిక్స్ ను చూస్తుంటే ప్రశాంత్ నీల్ పెద్దగానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు లోకేషన్స్ కూడా చాలా భయంకరంగా, మాస్ లుక్ కు సరిపడేలా ఉన్నాయి. సలార్ చిత్ర షూటింగ్ ఇప్పటికే 35 శాతం పూర్త‌యింది. అయితే ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అప్పుడు కూడా కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. తాజాగా ఫస్ట్ డేనే ఇలా లీక్ ల పర్వం పునరావ్రుతం కావడంతో చిత్ర యూనిట్ షాక్ అవుతోంది. 2023 సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోం కన్నడ స్టార్ హీరో ప్రుథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని హుంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement