Monday, April 29, 2024

ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుతో స‌న్నిహితంగా చంద్ర‌బాబు

కుటుంబం అన్నాక వివాదాలు , విభేదాలు త‌లెత్త‌డం స‌హ‌జ‌మే. దీనికి ధ‌నిక‌, పేద అనే తేడా లేదు. అదే త‌ర‌హాలో టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుల‌కి విభేదాలు ఉన్నాయి. కాగా దివంగ‌త ముఖ్యమంత్రి, న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు మ‌న‌వ‌రాలి పెళ్లి వేడుక ఘ‌నంగా జ‌రిగింది. దివంగ‌త ఎన్టీఆర్ చిన్న కూమారై ఉమామహేశ్వరి త‌న‌య‌ని పెళ్లి కూతురు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనవరాళ్లు ఇతర కుటుంబ సభ్యులు హాజరై పెళ్లి కూతురుని ఆశీర్వదించారు.

చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు… పెళ్లి వేడుకలో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.రాజకీయ విభాగాలతో చాలాకాలంగా దూరంగా ఉంటున్న వీరు ఈ పెళ్లి వేడుకలో.. ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఇక వారిద్దరూ పక్క పక్కన నిల్చుని ఫోటోలు కూడా దిగారు. దీని అంతటికి కారణం…హీరో బాల‌కృష్ణ‌ కృషి అనే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం వారి ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement