Friday, May 10, 2024

Railway: ఒమిక్రాన్ నియంత్రణకు రైల్వే కొత్త నిబంధనలు.. మాస్క్ లేకుండా వస్తే 500 ఫైన్..

ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. వైరస్ నియంత్రణకు కొత్త నిబంధనలు జారీ చేసింది. కాగా, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ అప్పుడే పలు దేశాలకు వ్యాపించింది. ఇండియాలో బెంగళూరులో 2 కేసులతో ప్రారంభమై..ఇప్పుడు 25 వరకూ పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్‌కు కారకమైన డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా విస్తరించనుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా రైల్వేశాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఒమిక్రాన్ దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు జారీ అయ్యాయి.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కఠినమైన మార్గదర్శకాల్ని జారీ చేసింది రైల్వే డిపార్ట్ మెంట్‌. ప్ర‌తి రైల్వే కార్మికుడికి వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది. మాస్క్ లేకపోతే ఎవరికీ రైల్వే స్టేషన్, రైళ్లలో ప్రవేశం లేదు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ లేకుండా రైల్వే స్టేషన్‌లోకి వస్తే..500 రూపాయలు జరిమానా విధించనున్నారు. ఇప్పటికే ఈ కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు కూడా జరుగుతున్నాయి. రైల్వే శాఖ జారీ చేసిన నిబంధనలపై అవగాహన కోసం ప్రకటనల రూపంలో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement