Wednesday, May 1, 2024

చంద్ర‌బాబు జిత్తుల‌మారి..భువనేశ్వ‌రి పేరే ఎత్త‌లేదు..అంబ‌టి రాంబాబు..

టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు భార్య భువ‌నేశ్వ‌రిని తాము ఏమీ అన‌లేద‌ని అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు జిత్తుల‌మారి అని వ్యాఖ్యానించారు. అందితే జుట్టు లేదంటే కాళ్లు ప‌ట్టుకునే స్వ‌భావం అత‌నిది అని అన్నారు. భువ‌నేశ్వ‌రిగారికి న‌మ‌స్క‌రించి చెబుతున్నాం ..మిమ్మ‌ల్ని మేము ఏమీ అన‌లేద‌మ్మా అని చెప్పారు. మీ పేరు ఉప‌యోగించి సానుభూతి కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. శాస‌న‌స‌భ‌కు మ‌ళ్లీ రాను అని చంద్ర‌బాబు అన్నారు. వ‌స్తే సీఎంగానే వ‌స్తాన‌ని శ‌ప‌థం చేశారు..త‌న భార్య‌ను కించ‌ప‌రిచార‌ని బాబు చెబుతున్నారు. చంద్ర‌బాబు భార్య గురించి ఎవ‌రూ ఎక్క‌డా మాట్లాడ‌లేద‌న్నారు. మాట్లాడితే చూపించండి అంటూ అంబ‌టి స‌వాల్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement