Friday, May 3, 2024

ఏడు ఇండియా-ఒక పాకిస్తాన్ యూట్యూబ్ ఛాన‌ల్స్ ని ర‌ద్దు చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

ఏడు ఇండియా..ఒక పాకిస్తాన్ యూట్యూబ్ ఛాన‌ల్ల‌ని ర‌ద్దు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. కాగా ఈ ఛాన‌ళ్లు నకిలీ, భార‌త్‌కు వ్య‌తిరేక కాంటెంట్‌ను ప్ర‌సారం చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో గ‌త డిసెంబ‌ర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బ్లాక్ చేసిన ఛాన‌ళ్ల సంఖ్య 102కు చేరుకున్న‌ది. ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌తో పాటు ఆ ఫ్లాట్‌ఫామ్‌పై రెండు పోస్టుల‌ను కూడా బ్లాక్ చేసిన‌ట్లు కేంద్ర స‌మాచార, ప్ర‌సార‌శాఖ తెలిపింది. 8 యూట్యూబ్ ఛాన‌ళ్ల‌కు మొత్తం 86 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నార‌ర‌ని, సుమారు 114 కోట్ల మంది ఆ వీడియోల‌ను చూశార‌ని, అయితే ఆ ఛాన‌ళ్లు విద్వేషాన్ని రెచ్చ‌గొడుతోంద‌ని, మ‌త వ్య‌తిరేక ప్ర‌చారాలు చేస్తున్న‌ట్లు ఐబీ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement