Monday, April 29, 2024

కేంద్ర అవార్డులు.. కె.వి.ఎన్ చక్రధర్ బాబు.. సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణకు పురస్కారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నీరు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వ అవార్డులు వరించాయి. న్యూఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్కే సింగ్ చేతుల మీదుగా సీబీఐపీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్) పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబుకు కేంద్ర మంత్రి అవార్డును ప్రదానం చేశారు.

సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ థర్మల్ విద్యుత్ రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ&ఎం ఎస్‌సీసీఎల్ డైరెక్టర్ డి.సత్యనారాయణరావు ఆర్కే సింగ్ నుంచి పురస్కారాన్ని తీసుకున్నారు. నీరు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగాలలో ఉత్తమ పనితీరును ప్రోత్సహించడానికి వివిధ సంస్థలు, వాటాదారులు, నిపుణుల సహకారానికి గుర్తింపుగా సీపీఐపీ సంస్థ వివిధ విభాగాల్లో ప్రతి ఏడాది అవార్డులను అందజేస్తోంది. 2022 సంవత్సరానికిగానూ 6 విభాగాలలో ఆంధ్రప్రదేశ్ తరఫున అవార్డులు సమర్పించగా, 4 విభాగాలలో అవార్డులను గెలుచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement