Monday, April 29, 2024

మచిలీపట్నం వీధులన్ని సిమెంట్ రోడ్లు చేస్తాం – మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం : నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని రోడ్లను సుందరంగా తీర్చిదిద్దడం తమ‌ ధ్యేయమని, వీధుల‌న్నింటినీ విడతలవారీగా సిమెంట్ రోడ్లు చేస్తామని రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41 వ డివిజన్ లోని కుమ్మరగూడెంలో బట్టీల రహదారిని సిమెంట్ రోడ్డుగా రూపొందించేందుకు రూ.4 లక్షల వ్యయంతో 90 మీటర్ల సిమెంట్ రోడ్ల పనులకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. శ్రామికజీవులు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో సరైన రహదారి సౌకర్యం లేక, తయారుకాబడిన ఇటుకలు వేరే ప్రాంతానికి తరలించలేని దైన్య పరిస్థితి దశాబ్దాల తరబడి నెలకుంద‌న్నారు. పట్టణాభివద్ధే లక్ష్యంగా , ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు.50 డివిజన్లలో పారిశుధ్యం,రోడ్లు, మంచి నీటి సదుపాయం,విద్యుత్‌, మురుగు కాలువల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. మారుతున్న కాలానికి అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయని,డివిజన్లు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

మురుగు కాలువలు, రోడ్లు,వీధి దీపాలు,పిచ్చి మొక్కలు తదితర స్థానిక సమస్యలను కార్పొరేటర్లు తక్షణమే పరిష్కరించాలన్నారు. ముమ్మారిగూడెంలో ఈ రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను తన దృష్టికి తీసుకొచ్చిన డిప్యూటీ మేయర్, 41 వ డివిజన్ కార్పొరేటర్ లంకా సూరిబాబును మంత్రి పేర్ని నాని ఈ సందర్భంగా అభినందించారు. ఈ సిమెంట్ రోడ్డు శంఖుస్థాపన కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలకసంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్, మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గూడవల్లి నాగరాజు, పలువురు కార్పొరేటర్లు చిటికెన నాగేశ్వరరావు,మహమ్మద్ రఫీ, పర్ణo సతీష్ , శ్రీరామ్,గుప్తా, స్థానిక పార్టీ నాయకులు మరీదు నాగరాజు, లోకల్ శ్రీను తదితరులతోపాటు మునిసిపల్ ఎం ఇ త్రినాధ రావు, ఎ ఇ వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement