Monday, April 29, 2024

Breaking: జంపన్న వాగులోకి దూసుకెళ్లిన కారు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో ఆదివారం ఉదయం ఓ కారు అదుపుతప్పి పడిపోయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కి చెందిన మల్లేష్ కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి గద్దెల వద్దకు వెళ్లే క్రమంలో కారు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీధర్ క్రెన్ సహాయంతో కారును బయటకు తీశారు. కార్లో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపొవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement