Saturday, May 4, 2024

ఏప్రిల్​లో ఉప ఎన్నికలు.. షెడ్యూల్​ ప్రకటించిన ఎన్నికల కమిషన్​

నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు అసన్‌సోల్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శనివారం ప్రకటించింది. ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ స్థానాలు – బల్లిగంజ్ (పశ్చిమ బెంగాల్), ఖైరాఘర్ (ఛత్తీస్‌గఢ్), బోచాహా (బీహార్), కొల్హాపూర్ నార్త్ (మహారాష్ట్ర). EC నోటిఫికేషన్ ప్రకారం.. ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను మార్చి 17న విడుదల చేస్తారు. నామినేషన్ల చివరి తేదీ మార్చి 24న ఉంటుంది. అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 28గా ఖరారు చేశారు. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 16న జరగనుంది.

గత ఏడాది అక్టోబర్‌లో బీజేపీతో విభేదాల కారణంగా సిట్టింగ్ ఎంపీ బాబుల్ సుప్రియో లోక్‌సభకు రాజీనామా చేయడంతో అసన్సోల్ స్థానం ఖాళీ అయింది. ఆ తర్వాత తాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్రతా ముఖర్జీ గత ఏడాది నవంబర్ 4న స్వల్ప అనారోగ్యంతో చనిపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని బల్లిగంజ్ అసెంబ్లీ స్థానం కూడా ఖాళీ అయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ అసెంబ్లీ స్థానంలో దేవవ్రత్ సింగ్ కాంగ్రెస్ తరపున గెలిచారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికైన సింగ్ (52) గత ఏడాది నవంబర్‌లో గుండెపోటుతో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయింది.

గత ఏడాది నవంబర్‌లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)కి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముసాఫిర్ పాశ్వాన్ మరణంతో బీహార్‌లోని బోచాహా అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. కాగా, మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ స్థానానికి చెందిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రకాంత్ జాదవ్ గత ఏడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement