Monday, April 29, 2024

వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల న‌ష్ట‌మే – బ్రిట‌న్ ప్ర‌ధాని

వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల ఉద్యోగుల దృష్టి మ‌ర‌లుతుంద‌ని చెప్పారు బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్. . పని మధ్యలో ఇంకో కాఫీ తెచ్చుకునేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తామన్నారు. ఆ తర్వాత మళ్లీ స్నాక్స్‌ తెచ్చుకోవడానికి అలా నడుచుకుంటూ రిఫ్రిజిరేటర్ వద్దకు వెళ్తామని, తిరిగి నిదానంగా వస్తూ ల్యాప్‌టాప్ వద్దకు వచ్చేసరికి చేస్తున్న పనేంటో కూడా మర్చిపోతామని అన్నారు. కాబట్టే మళ్లీ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన మాటలు చాలా మందికి నచ్చకపోవచ్చని, మన చుట్టూ ఇతర ఉద్యోగులు కూడా ఉన్నప్పుడు మన నుంచి మరింత ప్రొడక్టివిటీ వస్తుందని బోరిస్ జాన్సన్ వెల్ల‌డించారు. అంతేకాదు, మరింత ఉత్సాహం, కొత్తకొత్త ఐడియాలతో పనిచేస్తామని తాను విశ్వసిస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement