Sunday, April 28, 2024

Breaking : ఇది మీ విజ‌యం..మ‌మ‌తాబెన‌ర్జీ ట్వీట్..

బిజెపి రైతుల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు చూసి చ‌లించిపోయాన‌ని తెలిపారు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. అలుపెర‌గ‌ని పోరాటం చేసిన ప్ర‌తి ఒక్క రైతుకు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు అని అన్నారు. ఇది మీ విజయం.. ఈ పోరాటంలో తమ ఆత్మీయులను కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతి‘ అని ట్విట్టర్ లో తెలిపారు. మూడు రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోడీ తాజాగా వెల్లడించారు. దీనిపై ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు స్పందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement