Friday, May 3, 2024

Breaking : మోడీకి ధ‌న్య‌వాదాలు..రైతులంద‌రు ఇళ్ల‌కు వ‌చ్చేయండి..సోనూసూద్..

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకున్నందుకు ప్ర‌ధాని మోడీకి ధ‌న్య‌వాదాలు తెలిపాడు హీరో సోనూసూద్. ఇది ఒక అద్భుత‌మ‌ని కొనియాడారు. శాంతియుతమైన నిరసనల ద్వారా న్యాయమైన డిమాండ్లను లేవనెత్తినందుకు రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. మీ కుటుంబాలతో కలిసి ఉండటానికి ఇళ్లకు వస్తారని ఆశిస్తున్నాం అంటూ రైతులను ఉద్దేశించి సోనూ సూద్ అన్నారు. అయితే సోనుసూద్ రాజకీయ పరమైన అంశాలపై అప్పుడప్పుడు స్పందిస్తుంటారు కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు మాత్రం ఎంట్రీ ఇవ్వను అనే సమాధానాలు ఇచ్చారు. రీసెంట్ గా సోనూ సోద‌రి రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement