Saturday, May 4, 2024

Breaking : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన యోగి ఆదిత్యనాథ్ – మార్చి 25న సీఎంగా ప్రమాణ స్వీకారం

మార్చి 25న యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.అంతకుముందు యోగి ఆదిత్యనాథ్ శాసనమండలి (ఎమ్మెల్సీ)కి రాజీనామా చేశారు. ఈసారి ఆయన గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017 అసెంబ్లీ ఎన్నికల తర్వాత యోగి ఆదిత్యనాథ్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆయన గోరఖ్‌పూర్‌ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఈసారి యోగి ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని బీజేపీ నిర్ణయించింది. గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి యోగి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో యోగి ఘనవిజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మార్చి 25, 2022న యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు. యూపీ రాజకీయాల్లో 37 ఏళ్ల తర్వాత ఓ పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement