Friday, April 26, 2024

Breaking : హిందూ విద్యార్థులు ఉగ్ర‌వాదులు – వివాదాస్పద జర్నలిస్టు రాణా అయ్యూబ్‌పై ఎఫ్‌ఐఆర్‌

కర్ణాటక హిజాబ్ వివాదంపై హిందూ విద్యార్థులను తీవ్రవాదులుగా పేర్కొంటూ వివాదాస్పద జర్నలిస్టు రానా అయ్యూబ్ చిక్కుల్లో పడ్డారు. ఉడిపి కాలేజీలో కాషాయ జెండాలు ఊపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులుగా అభివర్ణించినందుకు కర్ణాటకలోని హుబ్లీ-ధార్వాడ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు, కీటో ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ద్వారా రూ.1.77 కోట్లు సమీకరించడం ద్వారా రాణా అయూబ్ అకౌంట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్తంభింపజేసింది.

ఫిబ్రవరి 13, 2022 న, కర్ణాటకలో హిజాబ్‌పై కొనసాగుతున్న వివాదం మధ్య, రాణా అయ్యూబ్ ఒక ఇంటర్వ్యూలో ఉడిపిలోని కళాశాల విద్యార్థులను ఉగ్రవాదులుగా అభివర్ణించారు. దీని తరువాత, ఫిబ్రవరి 21, 2022 న, రాణా అయ్యూబ్‌పై హిందూ సంస్థ ‘హిందూ ఐటీ సెల్’ ఫిర్యాదు చేసిందిఒక విద్యాసంస్థలో మగ విద్యార్థులు ఎందుకు కాషాయ జెండాలు ఊపుతున్నారు? దాని అర్థం ఏమిటి అని రానా అయ్యూబ్ హిందువులపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందూ ఐటీ సెల్ ఫిర్యాదు దాఖలు చేసింది. రాణా అయ్యూబ్‌పై చర్య తీసుకోవాలని కోరింది. హిందూ ఐటీ సెల్ పోలీసులను భారత వ్యతిరేక రాణా అయ్యూబ్‌పై ప‌లు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరింది. విదేశీ వేదికలపై అసత్యాలు ప్రచారం చేసిన వివాదాస్పద జర్నలిస్ట్ రానా అయ్యూబ్ తన దేశంలో ఆర్థిక మోసానికి పాల్పడి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా రూ.1.77 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement