Wednesday, May 8, 2024

Breaking : ఇంటి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత తెలంగాణదే – మంత్రి కేటీఆర్

నేడు వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు మంత్రి కేటీఆర్..ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ లో 119నియోజకవర్గాలు ఉండగా..ఎక్కడ లేని విధంగా నర్సంపేట లో తక్కువ ధరలో ఇంటి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారన్నారు ఐటీశాఖ మంత్రి కేటీఆర్. కార్యకర్త నుండి సర్పంచ్, జడ్పీటీసీ ,ఎమ్మెల్యే ప‌ద‌వి చేప‌ట్టిన నాటి నుండి పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నార‌న్నారు. 100కోట్ల పై చిలుకు నిధులను మంజూరు చేయించుకొని .. నర్సంపేట లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు..ఎక్కడ కలిసిన నర్సంపేట అభివృద్ధి గురించే MLA మాట్లాడతారు..14 ఏళ్ళ పాటు కొట్లాడి.. రోడ్ లకి ఎక్కి రాష్ట్రాన్ని సాధించుకున్నాం..బంగారు తెలంగాణ కోసం ఒక్కో అడుగు వేసుకుంటూ పోతున్నామ‌న్నారు..75 ఏళ్ళ భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత మన తెలంగాణదేన‌ని మంత్రి అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక నర్సంపేట లో 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్ లన్ను మంజూరు చేసుకొని 670 కోట్ల రూపాయలను వెచ్చించి 60 వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చాం..ఎవరైనా చనిపోతే దహన సంస్కారాల కోసం కరెంట్ ఉండక పోయేది…నీళ్ల కోసం ..స్మశాన వాటిక దగ్గర ఆడుక్కునే పరిస్థితి గతం లో ఉండేది ..24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే ..ఒక్కో రైతు కి పెట్టుబడి సాయంగా ..5000 రూపాయలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన కెసిఆర్..నర్సంపేట లో పసుపు, పత్తి, మిర్చి బాగా పండుద్ది.. వివిధ పంటల కోసం త్వరలో ఆహార శుద్ధి ఫ్యాక్టరీ ఇస్తాం..మిగిలి పోయిన అభివృద్ధి పనుల కోసం త్వరలో 50 కోట్ల రూపాయల ను మంజూరు చేస్తాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement