Friday, May 10, 2024

Breaking : లుథియానాలో రాహుల్ ప‌ర్య‌ట‌న – ఆదివారం సీఎం అభ్య‌ర్థి పేరు ప్ర‌క‌ట‌న

కాంగ్రెస్ కీల‌క నేత రాహుల్ గాంధీ పంజాబ్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఆదివారం ప్ర‌క‌టించ‌నున్నారు. ఆదివారం రాహుల్ గాంధీ లుథియానాలో ప‌ర్య‌టించ‌నున్నారు. రోజుకో ట్విస్ట్ అన్న‌ట్టుగా మారాయి పంజాబ్ పాలిటిక్స్. బిజెపిని వెన‌క్కినెట్టి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీలు త‌మ హ‌వాని కొన‌సాగిస్తున్నాయి. కాగా సీఎం అభ్య‌ర్థిని నేనంఏ నేనే అని పోటీ ప‌డుతూ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. లేటెస్ట్‌గా ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తానే ముందున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత సునీల్‌ జాఖర్‌. కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌ కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ..ఎమ్మెల్యేలందరూ తనకే మద్దతుగా ఉన్నారని ప్రకటించారు సునీల్‌ జాఖర్‌. మ‌రి రాహుల్ గాంధీ ఎవరి పేరును ప్ర‌క‌టించ‌నున్నారో అనేది స‌స్పెన్స్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement