Friday, May 17, 2024

Breaking : ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకు – తిరంగా బైక్ ర్యాలీ చేప‌ట్టిన ఎంపీలు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించేందుకు ఆగస్టు 3 ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి బయలుదేరిన బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రులు, యువ పార్లమెంటేరియన్‌లతో సహా పలువురు పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా వీధుల్లో త్రివర్ణ పతాకాలు, బైక్ ల‌తో ఎంపీలు సామాజిక సందేశాన్ని పంపుతూనే పౌరులలో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రయత్నించింది. ఎర్రకోట నుంచి బైక్ పై వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇండియా గేట్ దగ్గర కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడారు.

మన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిస్తున్నాం, వారిని స్మరించుకుంటున్నాం అనే సందేశాన్ని అందించేందుకు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, యువనేతలు తరలివచ్చి చారిత్రక ఎర్రకోట నుంచి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ ఆజాది-కా-అమృత్-మహోత్సవ్, మేము దేశం యొక్క ఐక్యత .. సమగ్రతను కాపాడేందుకు .. భారతదేశ కీర్తిని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం అని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభకు నాలుగోసారి సభ్యుడైన ఠాకూర్ యువజన వ్యవహారాలు .. క్రీడల ఇన్‌ఛార్జ్‌గా కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement