Thursday, May 2, 2024

Breaking : విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ గా కాంతి రాణా టాటా .. చెడ్డీగ్యాంగే టార్గెట్ ..

ఈ మ‌ధ్య‌కాలంలో చెడ్డీగ్యాంగ్ చెల‌రేగిపోతున్నారు. వారిపేరు తెగ వినిపిస్తోంది. విజ‌య‌వాడ‌లోని ఓ అపార్ట్ మెంట్ లో క‌ర్ర‌లు, క‌త్తులు చేత‌బ‌ట్టినట్టు సీసీ కెమెరాల‌లో రికార్డ్ అయ్యాయి. కాగా నేడు విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ గా సీనియర్ ఐపిఎస్ అధికారి కాంతి రాణా టాటా బాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడలో మంచి మార్పులకు శ్రీకారం చూడతాననని ఆయన ప్రకటించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళల భద్రత, నేరాలు, గంజాయిపై ఉక్కుపాదం మోపుతానని తెలిపారు.పోలీస్ అధికారులు, ఉద్యోగులలో అవినీతి, నిర్లక్ష్యం సహించబోనని హెచ్చరించారు. మత్తు పదార్దాలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలపై ప్రత్యేక దృష్టిపెడతానని సిపి కాంతి రాణా టాటా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement