Saturday, May 11, 2024

Breaking : గ్యాంగ్ స్ట‌ర్ సందీప్ బిష్ణోయ్ హ‌త్య‌-బాంభియా గ్యాంగ్ హ‌త్య చేసిన‌ట్లు అనుమానం

రాజ‌స్థాన్ లో గ్యాంగ్ స్ట‌ర్ సందీప్ బిష్ణోయ్ ను హ‌త్య చేశారు.కాగా పంజాబ్‌కు చెందిన బాంభియా గ్యాంగ్ ఈ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. హిసార్‌లోని మంగ‌లి గ్రామం సందీప్ స్వ‌స్థ‌లం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సందీప్‌కు పెద్ద‌గా లింకు లేద‌ని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. లారెన్స్ గ్యాంగ్‌తో సందీప్ బ్రేక‌ప్ అయిన‌ట్లు తెలుస్తోంది. సింగ‌ర్ సిద్ధూ మూసేవాలా హ‌త్య‌తో అత‌నికి ఎటువంటి సంబంధం లేద‌ని పంజాబ్ పోలీసులు తెలిపారు. రాజ‌స్థానీ గ్యాంగ్‌లే అత‌న్ని చంపి ఉంటార‌ని అనుమానిస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement