Thursday, May 2, 2024

Breaking : ప్లోరిడా అడ‌వుల్లో మంట‌లు – 15వేల ఎక‌రాలు ద‌గ్థం

ప్లోరిడా అడ‌విలో మంట‌లు చెల‌రేగుతూనే ఉన్నాయి. అమెరికాలోని ఆగ్నేయ రాష్ట్ర‌మైన ప్లోరిడా అడ‌వుల్లో మంట‌లు చెల‌రేగ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు 15వేల ఎకరాలు ద‌గ్థం అయ్యాయి. ఫ్లోరిడా ఫారెస్ట్ లో చెల‌రేగుతున్న మండ‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు వైల్డ్‌ల్యాండ్ అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సేవా విభాగాల సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నార‌ని వార్తా సంస్థ జిన్హువా నివేదించింది. ఈ అగ్రిప్ర‌మాదం వ‌ల్ల ఫ్లోరిడాలోని బే కౌంటీలో ప్రాంతంలో ఉన్న దాదాపు 1,100 మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. అడ్కిన్స్ అవెన్యూలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇందులో 12 మందిగి గాయాలు అయ్యాయ‌ని వార్తా సంస్థ AP తెలిపింది. మ‌రో వార్తా సంస్థ IANS నివేదిక, ఫ్లోరిడా ఫారెస్ట్ సర్వీస్ ప్రకారం.. ‘‘ స్థిరమైన గాలులు, పొడిగా, దట్టంగా చనిపోయిన చెట్లు ఉండ‌టంతో ఈ మంట‌లు మరింతగా వ్యాపిస్తున్నాయ‌ని, గ‌త రెండు రోజుల నుంచి ఇవి మ‌రింత‌గా ఎక్కువ‌య్యాయ‌ని తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement