Sunday, May 5, 2024

Breaking : డిసెంబ‌ర్ 19న టీఆర్ ఎస్ విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌..

డిసెంబ‌ర్ 19న దేవ‌న్న‌పేట‌లో టీఆర్ ఎస్ విజ‌య‌గ‌ర్జ‌న స‌భ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 29న జ‌ర‌గాల్సిన స‌భ ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. వరంగల్‌లో నిర్వహించాలనుకున్న విజయగర్జన సభను వాయిదా వేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా, టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభను వరంగల్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ముందుగా ఈనెల 15వ తేదీన సభను నిర్వహించాలనుకున్నారు. అయితే అది అనివార్య కారణాలతో వాయిదా పడింది.

దీంతో తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన ఈ సభను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు వరంగల్‌లో సభ నిర్వహించేందుకు స్థలాన్ని కూడా ఎంపిక చేశారు.. పనులు కూడా మొదలుపెట్టారు. అయితే అక్కడి స్థానిక రైతులు సభను తమ స్థలాల్లో నిర్వహించవద్దంటూ ఆందోళనలు చేశారు. ఇదిలా ఉండగానే.. మరోసారి విజయ గర్జన సభ వాయిదా పడింది.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువ‌డ‌టంతో వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement