Tuesday, April 30, 2024

Breaking : డాల‌ర్ శేషాద్రితో 25ఏళ్ళ అనుబంధం నాది .. సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ ..

సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ .. తిరుప‌తిలో డాల‌ర్ శేషాద్రి మృత‌దేహానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా శేషాద్రి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ .. డాల‌ర్ శేషాద్రి లేర‌న్నది న‌మ్మ‌లేక‌పోతున్నార‌న్నారు. శేషాద్రితో 25ఏళ్ల అనుబంధం ఉంద‌ని తెలిపారు. శేషాద్రి మృతి నాకు వ్య‌క్తిగ‌తంగా తీర‌ని లోట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేవుడి సేవ‌లో త‌రిస్తూ ఆరోగ్యాన్ని కూడా విస్మ‌రించార‌ని అన్నారు. శేషాద్రి ర‌చించిన పుస్త‌కాల‌ను టీటీడీ ముద్రించి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement