Sunday, December 5, 2021

Breaking : అసెంబ్లీలో ఉన్నామా..గొడ్ల‌చావిడిలో ఉన్నామా..ఫైర్ అయిన బాల‌కృష్ణ‌..

మీడియా ముందుకొచ్చింది నంద‌మూరి కుటుంబం. నిన్న టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు క‌న్నీళ్లు పెట్టుకున్న ఘ‌ట‌న‌పై నంద‌మూరి బాల‌కృష్ణ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న మాట్లాడుతూ..జ‌రుగుతున్న అరాచ‌కాల‌కు జ‌న‌మే స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. నోటితో కాదు ఓటుతో జ‌నం జ‌వాబు చెప్పాల‌న్నారు. వ్య‌క్తి గ‌త దూష‌ణ‌లు స‌రికావ‌ని అన్నారు. జ‌రిగిన ప‌రిణామాలు దుర‌దృష్ట‌క‌ర‌మైన‌వ‌ని అన్నారు. వ్య‌క్తిగ‌త అజెండాగా పెట్టుకుని వైసీపీ నేత‌ల మాట‌ల దాడి స‌రికాద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు,ప‌లు అంశాల‌మీద పోరాటం చేయాల‌ని దివంగ‌త నేత ఎన్టీఆర్ చెప్పార‌ని గుర్తు చేశారు. గొడ్ల చావిడిలో ఉన్నామా..అసెంబ్లీలో ఉన్నామా అని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News