Sunday, November 28, 2021

చంద్రబాబుకు అవమానం.. ఉద్యోగానికి హెడ్ కానిస్టేబుల్ రాజీనామా!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైయ్యాయి. అంసెబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించారని ఆరోపణలు చేస్తూ ఏపీలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సదరు హెడ్‌ కానిస్టేబుల్ ఓ వీడియో విడుదల చేశారు.

తను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998 బ్యాచ్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ప్రకాశం జిల్లా నుంచి టాపర్‌గా నిలిచానని ఆయన అన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిజాయితీ పనిచేశానని చెప్పారు. ఎప్పడూ ఎక్కడా చేయిచాచకుండా విధులు నిర్వహించానని తెలిపారు. అయితే ఏపీలో పరిస్థితులు పోలీసులకు, ప్రజలకు తెలుసునన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అసెంబ్లీలో విలువ లేకుండా దూషించడం సబబు కాదన్నారు. విలువలేని వారివద్ద పనిచేయలేకే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News