Monday, April 29, 2024

Breaking : కుప్ప కూలిన ఎయిర్ అంబులెన్స్.. పేషెంట్ తో స‌హా ఐదుగురి మృతి

ఎయిర్ అంబులెన్స్ కుప్ప కూలింది.ఈ ప్ర‌మాదంలో పేషెంట్ తో స‌హా ఐదుగురు మ‌ర‌ణించారు.ఈ సంఘ‌ట‌న అమెరికా నెవాడాలో చోటు చేసుకుంది. అమెరికాలో మంచు తుపాను విజృంభిస్తోంది. ఈ కారణంగా విమానం ప్రయాణించేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. నెవాడా సరిహద్దుల్లోకి వచ్చేసరికి విమానం రాడార్ తో సంబంధాలు కోల్పోయింది. సెంట్రల్ లియోన్ కౌంటీలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎయిర్ అంబులెన్స్ విమానంలో పైలెట్, రోగి, రోగి సహాయకుడు, నర్సు, పారామెడికల్ నిపుణుడు ఉన్నారు. వీరందరూ ప్రాణాలు కోల్పోయినట్టు సెంట్రల్ లియోన్ కౌంటీ అధికారులు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement