Sunday, April 28, 2024

బ్యాక్ టు వ‌ర్క్.. ఫొటో పోస్ట్ చేసిన‌ కియారా

బ్యాక్ టు వ‌ర్క్ అని ఫొటోని పోస్ట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ కియార అద్వాని. రాజస్థాన్ లోని జైసల్మీర్ లో ఫిబ్రవరి 7న తక్కువ మంది అతిధుల మధ్య.. అంగరంగ వైభవంగా ఒక్కటయ్యారు బాలీవుడ్ నటులు కియారా, సిద్దార్ధ్. పెళ్ళి కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని.. దాదాపు 20 రోజులు సెలవు తీసుకున్న కియారా.. ఇక బ్యాక్ టూ వర్క్ అంటోంది. షూటింగ్ స్పాట్ లో మేకప్ వేసుకుంటూ ఓ మిర్రర్ సెల్ఫీ పోస్ట్ చేసింది. బాలీవుడ్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపొయింది కియారా. చేతి నిండా సినిమా ఆఫర్స్ తో బిజీగా ఉంది కియారాఅద్వానీ. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ -శంకర్ సినిమాతో పాటు ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ సగంలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement