Monday, April 29, 2024

ఆసుప‌త్రిలో బ్రెజిల్ అధ్య‌క్షుడు – వైద్యం చేయొద్దంటోన్న ప్ర‌జ‌లు – ఎందుకో తెలుసా

ప్ర‌పంచ‌దేశాల‌ని కుదిపేస్తోంది క‌రోనా, ఒమిక్రాన్ వేరియంట్. ప‌లువురు సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు. కాగా బ్రెజిల్ అధ్య‌క్షుడు బొల్సోనారో తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. ఆయ‌న వ‌య‌సు 66సంవ‌త్స‌రాలు. దాంతో ఆయ‌న హాస్ప‌ట‌ల్ లో చేరారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. కాగా ఆయ‌న పేగుకు శ‌స్త్ర చికిత్స చేయాల‌ని డాక్ట‌ర్స్ తెలిపారు. ప్ర‌జ‌లు మాత్రం అధ్య‌క్ష‌డికి వైద్యం చేయవద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బొల్సోనారో అనుచిత నిర్ణయాల వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్రెజిల్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రజలు మాస్క్ పెట్టుకోనవసరం లేదని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు బొల్సోనారో చెప్పడంతో మాస్క్ పెట్టుకోకుండా తిరిగారు అక్క‌డి జ‌నం. దీంతో ఆ దేశంలో కరోనా విలయతాండవం చేసింది. ఆ సమయంలో లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. వేలాది మంది చనిపోయారు. చేతులు కాలాక అకులు పట్టుకున్న చందాన, కరోనా మహమ్మారి విజృంభణ తరువాత మాస్క్ తప్పనిసరి చేశారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అప్పటి నుంచి అధ్యక్షుడు బొల్సోనారోపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement