Thursday, April 25, 2024

Danger: ఒకే రన్ వేపై రెండు విమానాలు.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

దుబాయ్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో రెండు ఎమిరేట్స్ విమానాలు ఒకే రన్ వే మీదకు వచ్చాయి. ఏటీసీ అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు ప్రయాణికులు.. జనవరి 9న జరిగిన ఈ ఇన్సిడెంట్ ని సీరియస్ గా తీసుకుంది ఏవియేషన్ డిపార్ట్ మెంట్. UAE కి చెందిన ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ బాడీ ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ (AAIS) దీనిపై దర్యాప్తు జరుపుతోంది.

దుబాయ్ నుండి హైదరాబాద్ రావాల్సిన ఓ విమానం.. రాత్రి 9:45 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. కాగా, దుబాయ్ నుండి బెంగళూరు వెళ్లాల్సిన మరో ఎమిరేట్స్ విమానం కూడా అదే టైమ్ లో బయలుదేరాల్సి ఉంది. అయితే.. టేకాఫ్ కావాల్సిన రెండు విమానాలు కూడా ఒకే రన్‌వేపైకి వచ్చాయి. ఎమిరేట్స్ విమానాల షెడ్యూల్ ప్రకారం ఈ రెండు విమానాల మధ్య ఐదు నిమిషాలు మాత్రమే గ్యాప్ ఉంటుంది. ‘‘దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ కోసం అప్పుడే స్పీడ్ అందుకుంటోంది. అప్పుడే అదే దిశలో స్పీడ్ గా వస్తున్న మరో విమానాన్ని సిబ్బంది చూశారు. వెంటనే దాని టేకాఫ్‌ను ఆపేయాలని ATC నుంచి ఆదేశాలు అందాయి. దీంతో విమానం స్పీడ్ తగ్గించడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇక్కడ మరో ఎమిరేట్స్ ఫ్లైట్ దుబాయ్ నుండి బెంగళూరుకు బయలుదేరింది. అదే రన్‌వే నుండి టేకాఫ్ చేయడానికి బయలుదేరింది” అని ఘటన గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు.

ATC జోక్యం చేసుకున్న తర్వాత బెంగళూరు వెళ్లే ఎమిరేట్స్ విమానం బయలుదేరింది. హైదరాబాద్‌కు వెళ్లే ఎమిరేట్స్ విమానం టాక్సీ బేకి వెళ్లి కొన్ని నిమిషాల తర్వాత బయలుదేరింది. ఈ ఘటనపై UAE కి చెందిన ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ బాడీ ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ (AAIS) ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై విమానయాన సంస్థలకు తీవ్రమైన భద్రతా లోపం ఉన్నట్టు కంప్లెయింట్ అందింది. ఎమిరేట్స్ ఎయిర్ కూడా ఈ ఘటనను నిజమేనని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement