Monday, April 29, 2024

FLASH: ప్లాస్టిక్‌ కవర్‌లో పసికందు.. నిలోఫర్ ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన

హైదరాబాద్‌ నిలోఫర్ ఆసుపత్రి వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నీలోఫర్ ఆస్పత్రి వద్ద ప్లాస్టిక్‌ కవర్‌లో పసికందు గుర్తించారు. శిశువు ఉన్న కవర్‌ను ఆస్పత్రి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పెట్టి వెళ్లారు. ఆటోలో వచ్చి శిశువు ఉన్న కవర్‌ను పెట్టి పరారైయ్యారు. కవర్‌లో ఉన్న శిశువును గుర్తించి నీలోఫర్‌ సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారు. శిశువుకు జాండిస్‌, అంగవైకల్యం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శిశువును వదిలివెళ్లిన వారిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement