Monday, May 6, 2024

అమెరికాలో మంచు తుఫాన్ – 5రాష్ట్రాల‌కి ఎమరెన్సీ ప్ర‌క‌ట‌న‌

అమెరికా తూర్పు ప్రాంత‌మంతా మంచు తుపాన్ తో వ‌ణికిపోతోంది. ఈ మంచు తుఫాన్ ని నేష‌న‌ల్ వెద‌ర్ స‌ర్వీస్ కి చెందిన ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు బాంబోజెనిసిస్ అని పిలుస్తున్నారు. శీతల గాలులు, సముద్రంపైన వేడి గాలులు కలిసి వాతావరణ పీడనం పడిపోయి టెంపరేచర్లు పతనమవడంతో బాంబోజెనిసిస్ అని పిలుస్తున్నారు.దాన్నే సింపుల్ గా బాంబ్ సైక్లోన్ అని అంటున్నారు. నారీస్టర్ అనీ వ్యవహరించే ఈ తీవ్రమైన తుపాను.. నాలుగేళ్లలో రావడం ఇదే మొద‌టిసారి అట‌. న్యూయార్క్, మసాచుసెట్స్ నగరాల్లో రెండడుగల మందంలో మంచు కప్పేస్తోంది. గంటకు 10 సెంటీమీటర్ల చొప్పున మంచు రోడ్లపై పేరుకుపోతోంది. మసాచుసెట్స్ లో 95 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

లాంగ్ ఐలాండ్ లో కార్లపై మంచు కురిసింది. దీంతో ఓ కారులో ఉన్న మహిళ ప్రాణాలు విడిచింది. ఈ బాంబ్ సైక్లోన్ ధాటికి ఐదు రాష్ట్రాలు ఆత్యయిక స్థితిని ప్రకటించాయి. న్యూయార్క్, న్యూ జెర్సీ, మేరీల్యాండ్, రోడ్ ఐల్యాండ్, వర్జీనియాల్లోని 7.5 కోట్ల మంది దాని బారిన పడ్డారు. ఫ్లోరిడాను కూడా ఈ తుపాను తాకే ముప్పుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో 6 వేల విమానాలను రద్దు చేశారు. మంచు తుపానుకు తోడు హరికేన్ ముప్పుకూడా పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాలకు ఇప్పటికే వరద ముప్పు హెచ్చరికలను జారీ చేశారు. ఈశాన్య ప్రాంతాల్లో నేడు మొత్తం అతిశీతల పరిస్థితులే ఉంటాయని నిపుణులు హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement