Thursday, May 2, 2024

Breaking: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ కు కరోనా

దేశంలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోంది. చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌ లోకి వెళ్లింది. వైద్యులు సూచన ప్రకారం చికిత్స తీసుకుంటుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత రెండు రోజుల స్వల్ప లక్షణాలతో కరోనా పరీక్షులు చేయించుకోగా.. ఫలితాల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కాజోల్ తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని కాజోల్‌ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement