Thursday, May 2, 2024

ట్విట్ట‌ర్ లో బ్లూ టిక్.. తూ చీజ్ బడీ హై మస్త్ అంటోన్న అమితాబ్

ట్విట్ట‌ర్ లో స‌బ్ స్క్రిప్ష‌న్ ఫీజు చెల్లించ‌ని వారి ఖాతాల‌కు బ్లూటిక్ ను తొల‌గించిందిట్విట్ట‌ర్. కాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతాకు కూడా బ్లూటిక్ పోయింది. దీంతో బ్లూటిక్ స్థానంలో జాతీయ జెండాను తన పేరు ముందు అమితాబ్ పెట్టారు. తాను డబ్బు చెల్లించాలని, బ్లూటిక్ ను పునరుద్ధరించాలంటూ ఆయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది. ఈ మేరకు ఆయన అవధీ (ప్రయాగ్ రాజ్ లో మాట్లాడే భాష) లో ఫన్నీగా రాసుకొచ్చారు.హే ట్విట్టర్! వింటున్నావా నేను సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ కోసం డబ్బు చెల్లించాను. కాబట్టి దయచేసి నా పేరు ముందు నీలి కమలాన్ని (బ్లూ లోటస్) తిరిగి ఉంచండి. తద్వారా నేను అమితాబ్ బచ్చన్ ని అని ప్రజలు తెలుసుకుంటారు.

నేను మిమ్మల్ని చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నాను. మీ కాళ్ల మీద కూడా పడాలా అని ట్వీట్‌ చేశారు. తర్వాత అమితాబ్ ఖాతాకు బ్లూటిక్ ను ట్విట్టర్ పునరుద్ధరించింది. దీంతో శనివారం ఆయన స్పందించారు. ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ కు థ్యాంక్స్ చెబుతూ.. అర్ధరాత్రి 1.10 సమయంలో ట్వీట్ చేశారు.ఓయ్ మస్క్ అన్నా.. మీకు చాలా చాలా థ్యాంక్స్. నా పేరు ఎదుట.. ఆ బ్లూటిక్ యాడ్ అయింది’’ అని రాసుకొచ్చారు. ‘‘ఇంకేం చెప్పమంటావు అన్న.. నాకు పాట పాడాలని ఉంది. మీకు వినాలని ఉందా? అయితే వినండి. తూ చీజ్ బడీ మై మస్క్ మస్క్.. తూ చీజ్ బడీ హై మస్క్ అని అమితాబ్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమితాబ్ చేసిన ట్వీట్ పై కామెంట్ల వర్షం కురుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement