Monday, April 29, 2024

బ్లాక్ క్యాట్స్ తాంత్రిక్స్ .. లవంగం చేతిలో బీజేపీ.. వైరలవుతున్న కేటీఆర్ ట్వీట్

తాంత్రిక పూజ‌ల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ నేతలు ట్విట్ట‌ర్ ద్వారా ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో తాంత్రిక పూజలు చేస్తార‌ని, టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ మార్చడం వెనుక ఓ తాంత్రికుడి సలహా ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం విధిత‌మే. అయితే మంత్రి కేటీఆర్ బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్ గానే రియాక్ట అయి ఈ ల‌వంగం గారిని ఇలాగే వ‌దిలేయ‌కండిరా బీజేపీ బాబులూ అంటూ వ్యాఖ్యానించారు. పిచ్చి ముదిరి త్వరలో కరవడం మొదలుపెడతాడేమో అంటూ వ్యంగ్యంగా ప్రదర్శించారు.

మతిలేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడని కేటీఆర్ విమర్శించారు. ఎర్రగడ్డలో బెడ్ ఖాళీగానే ఉంది.. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి అంటూ సెటైర్ వేశారు.

అయితే ఒక గంట క్రితం మంత్రి కేటీఆర్ బ్లాక్ క్యాట్స్.. తాంత్రిక్స్.. తెలంగాణకు ఎన్‌డిఎ ప్రభుత్వం ఏమి అందించిందో చూపించేందుకు ఏమీ లేద‌ని.. మీకు పెద్ద జీరో ఉన్నప్పుడు మీరు దీనిపై ఆధారపడవలసి ఉంటుందని.. పిచ్చోడి చేతిలో రాయి = లవంగం చేతిలో బీజేపీ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement