Friday, March 29, 2024

రామ్ చ‌ర‌ణ్ న్యూ లుక్-పెట్ డాగ్ తో స్టిల్

పెట్ డాగ్ రైమ్ ని ఎత్తుకుని ఉన్న స్టిల్ ని షేర్ చేశాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. లేటెస్ట్ స్టిల్‌లో గ‌డ్డం లేకుండా సాఫ్ట్ లుక్‌లో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. రాంచ‌ర‌ణ్ తాజా ఫొటో ఇపుడు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌సీ 15 (RC15) సినిమాతో బిజీగా ఉన్నాడు రాంచ‌ర‌ణ్ . భారీ బ‌డ్జెట్‌తో దిల్‌రాజు తెర‌కెక్కిస్తున్న ఈ మూవీకి ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. శ్రీకాంత్‌, సునీల్, అంజ‌లి, క‌న్న‌డ యాక్ట‌ర్‌ జ‌య‌రామ్, న‌వీన్ చంద్ర ఇత‌ర కీ రోల్స్ చేస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆర్‌సీ 15 ప్రాజెక్టుకు కార్తీక్ సుబ్బ‌రాజు క‌థ‌నందిస్తుండ‌గా..సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్నారు. ఈ చిత్రంలో రాంచ‌ర‌ణ్ ఐఏఎస్ అధికారిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఈ మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement