Thursday, May 2, 2024

బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల బ‌ర్త్ డే – నిండు నూరేళ్లు బ‌త‌కాల‌ని సీఎం కేసీఆర్ లేఖ‌

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు గానీ, శాశ్వ‌త మిత్రులు గానీ ఉండ‌ర‌న్న మాట నిజ‌మే అనిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే..నేడు బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ పుట్టిన‌రోజు. ఈ నేపథ్యంలో హుజరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా… బిజెపి పార్టీ కార్యకర్తలు , ఆయన అనుచరులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్లెక్సీలు, పూలమాలతో… ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు బిజెపి రాష్ట్ర నాయకులు సైతం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈటల రాజేందర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెల‌ప‌డం గ‌మ‌నార్హం. ఈటెల రాజేందర్ నిండు నూరేళ్లు బతకాలని ఆయన దీవించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు సీఎం కేసీఆర్. ఇప్పుడీ లేఖ వైర‌ల్ అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement