Thursday, May 2, 2024

ల‌గ్జ‌రీ కారు కొనుగోలు చేసిన బిగ్ బాస్5 బ్యూటీ ‘ల‌హ‌రి’

బిగ్ బాస్ సీజన్5లో న‌టి ల‌హ‌రి కంటెస్టెంట్ గా పాల్గొన్న విష‌యం తెలిసిందే. బిగ్ బాస్ షోతో గుర్తింపుని పెంచుకుంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా లహరి తాజాగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేసింది. VOLVO XC60 అనే ఖరీదైన కారుని లహరి మహా శివరాత్రి సందర్భంగా కొనుగోలు చేసింది. చూడముచ్చటగా ఉన్న తన కారుతో ఫోజులు ఇస్తూ లహరి కొన్ని ఫోటోస్ ని షేర్ చేసుకుంది. దీంతో నెటిజన్లంతా లహరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. దీనితో లహరి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement