Sunday, May 19, 2024

Ukraine Russia War: ర‌ష్యా యుద్ద ట్యాంక‌ర్ ఎత్తుకెళ్లిన రైతు : వీడియో వైర‌ల్

గ‌త వారం రోజులుగా ర‌ష్యా వ‌ర్సెస్ ఉక్రెయిన్ మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది.ర‌ష్యా ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తూ.. కీల‌క న‌గ‌రాల‌ను స్వాధీనం చేసుకుంటూ వెళ్తోంది. అయితే ఈ సంద‌ర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఉక్రెయిన్​పై రష్యా దాడులు తీవ్రమ‌వుతున్న నేపథ్యంలో ఓ రైతు చేసిన పని ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. రష్యా బలగాలు యుద్ధ ట్యాంకర్‌తో తమ ప్రాంతానికి చేరుకున్నట్లు గుర్తించిన రైతు.. ట్రాక్టర్‌తో గుట్టుచప్పుడు కాకుండా అక్కడకు చేరుకున్నాడు. తన ట్రాక్టర్‌కు ఆ యుద్ధ ట్యాంకర్‌ను అనుసంధానం చేసి అక్కడి నుంచి తరలించాడు. ఇది గమనించిన రష్యా సైనికుడు ఆ వాహనాల వెనుక పరిగెడుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. బ్రిటిష్ కన్జర్వేటివ్ నేత, ప్లైమౌత్ మూర్ వ్యూ పార్లమెంటు సభ్యుడు జానీ మెర్సర్ ఈ వీడియోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘అతనేం నిపుణుడు కాదు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు నేడు రష్యా యుద్ధ ట్యాంకర్‌ను దొంగిలించాడు. రష్యా దాడి క్షీణిస్తున్నట్లు కనిపిస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement