Sunday, May 19, 2024

Breaking : రూ. 180కి చేర‌నున్న పెట్రోల్ ధ‌ర‌లు – 111డాల‌ర్ల‌కు ఎగ‌బాకిన బ్యారెల్ క్రూడాయిల్

భార‌త్ లో రూ. 180కి చేర‌నుంది పెట్రోల్ ధ‌ర‌లు.111డాల‌ర్ల‌కు ఎగ‌బాకింది బ్యారెల్ క్రూడాయిల్. 2008ఆర్థిక సంక్షోభం స‌మ‌యంలో 143.95డాల‌ర్లుగా ఉంది. 2020లో 9.2డాల‌ర్ల‌కు క్రూడాయిల్ ప‌డిపోయింది. వ‌చ్చే నెల‌లో 140డాల‌ర్ల‌కు పెరిగే అవ‌కాశం ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లకు చేరడం తెలిసిందే. భారత్ కొనుగోలు చేసే ముడి చమురు ధర మార్చి 1న బ్యారెల్ 102 డాలర్లకు చేరింది. 2014 ఆగస్ట్ తర్వాత ఇదే అత్యధిక ధర.

గతేడాది నవంబర్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ పెంపు నిలిచిపోయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సర్కారు నుంచి వచ్చిన అనధికారిక సూచనల మేరకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు అయిన బీపీసీఎల్, ఐవోసీ, హెచ్ పీసీఎల్ నాటి రేటునే స్థిరంగా కొనసాగిస్తున్నాయి. చివరి దశ పోలింగ్ ఈ నెల7తో ముగియనుంది. 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీంతో వచ్చే వారమే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతానికి లీటర్ పెట్రోల్, డీజిల్ విక్రయంపై రూ.5.7 వరకు నష్టపోతున్నాయి. దీనికి రూ.2.5 మార్జిన్ అదనం. దీంతో ఒక లీటర్ పై రూ.9-10 వరకు ధరను పెంచక తప్పని పరిస్థితి ఉందన్నది జేపీ మోర్గాన్ విశ్లేషణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement