Monday, April 29, 2024

బిగ్ బాస్5 విన్న‌ర్ వీరే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..

బిగ్ బాస్ రోజు రోజుకి ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను తారుమారు చేస్తోంది. ఇక ఈ సారి నామినేష‌న్ లో ర‌చ్చ ర‌చ్చ జ‌రిగింది. యాంకర్ రవి తప్ప సన్నీ, షణ్ముఖ్, సిరి, ప్రియాంక, కాజల్, మానస్, ఆనీ మాస్టర్, శ్రీరామ్ లు నామినేష‌న్ లో నిలిచారు. ఈ క్ర‌మంలో ఎపిసోడ్ లో ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా స‌న్నీ వ్య‌వ‌హ‌ర శైలి చాలా విచిత్రంగా ఉంది. హౌస్ లో ఉన్నవాళ్ళను జంతువులతో పోల్చి .. నటరాజ్ మాస్టర్ తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడా అనేలా న‌ల్ల న‌క్క‌, క‌ట్ల పాము అంటూ ష‌న్ను, సిరిలను పోల్చాడు. చాలా వింత‌గా ప్ర‌వ‌ర్తించారు.

ఈ వీకెండ్ ఎపిసోడ్ లో స‌న్నీని టార్గెట్ చేయ‌డంతో బిగ్ బాస్ మెనేజ్మెంట్ మీద‌.. స‌న్నీ అభిమానులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కురిపించారు. భారీగా ట్రోల్ చేశారు. నాగార్జునకు సరిగా నిర్వాహకులు స్క్రిప్టు. ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లేదు. నాగ్ కు త‌ప్పుడు సమాచారం ఇస్తున్నారనీ, స‌న్నీ ఇమేజ్ ఎంత బ్యాడ్ చేసినా.. త‌న దూకుడు ను ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని అంటూ కామెంట్స్ చేశారు స‌న్నీ ఫ్యాన్స్. ఈ క్ర‌మంలో సన్నీని కూడా షణ్ముఖ్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. అప్పడం వివాదంపై సన్నీని ట్రోల్ చేస్తున్నారు. అయితే బిగ్‌బాస్ విజేత ష‌ణ్ముఖ్ అని ష‌న్ను అభిమానులు ప్ర‌చారం సాగిస్తుంటే.. స‌న్నీనే ఈ సారి టైటిల్ విన్న‌ర్ అని అభిమ‌నులు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి శ్రీరామ‌చంద్ర సంగ‌తేంటీ..ఏమో చూడాలి మ‌రి టైటిల్ విన్న‌ర్ ఎవ‌ర‌నేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement