Thursday, March 28, 2024

Breaking : సంక్రాంతి త‌ర్వాత తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ..ఎమ్మెల్సీ క‌విత‌కి ఛాన్స్ ద‌క్కేనా..

సంక్రాంతి త‌ర్వాత తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. కేబినెట్ లోకి బండ ప్ర‌కాష్,వెంక‌ట్రామిరెడ్డి,గుత్తా,క‌ల్వ‌కుంట్ల క‌విత ఉండ‌నున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌తో సంకేతాలు పంపారు సీఎం కేసీఆర్. స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ క‌విత‌కు అవ‌కాశం ఇచ్చారు. కాగా తెలంగాణ కేబినెట్ లో ఐదుగురు మంత్రుల‌కు ప‌ద‌వీగండం ఉంది. ముగ్గురు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రుల‌పై వేటు ప‌డ‌నుంది. ఈట‌ల స్థానాన్ని ముదిరాజ్ వ‌ర్గానికి చెందిన బండ‌ప్ర‌కాష్ తో భ‌ర్తీ చేయ‌నున్నారు. కౌశిక్ రెడ్డికి డ‌బుల్ ప్ర‌మోష‌న్ ..కౌన్సిల్ విప్ లేదా కేబినెట్ ఛాన్స్ ఉండ‌నుంది. కేబినెట్ విస్త‌ర‌ణ‌పై టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement