Thursday, April 25, 2024

బిగ్ బాస్5 గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ తార‌ల సంద‌డి : నిజ‌మేనా !

బిగ్ బాస్ 5 ముగింపు ద‌శ‌కు చేరుకోబోతుంది. కాగా బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ‌చంద్ర‌, మాన‌స్, సిరి, స‌న్నీ, ష‌ణ్ముఖ్ మిగిలారు. కాగా వీరిలో బిగ్ బాస్ టైటిల్ ను ఎవ‌రు సాధిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌త నెల‌కొని ఉంది. ప్ర‌తీ సీజ‌న్ గ్రాండ్ ఫినాలేను బిగ్ బాస్ యాజ‌మాన్యం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుపుతుంది. బిగ్ బాస్ విన్న‌ర్ ను టాప్ సెల‌బ్రిటీతో ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు ఇప్ప‌టి వ‌ర‌కు. మ‌రి బిగ్ బాస్5కి వ‌చ్చే సెల‌బ్రిటీ ఎవ‌ర‌నేదానిపై ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటీ రాలేదు.

కాగా బాలీవుడ్‌ స్టార్‌లు ఈసారి రంగంలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే, అలియా భట్‌ ఈ గ్రాండ్‌ ఫినాలేకు వస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో పాటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌ కూడా సందడి చేయనున్నార‌ట‌. ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీమ్‌ కూడా గ్రాండ్‌ ఫినాలేలో కాసేపు తళుక్కుమనున్నారని టాక్‌ నడుస్తోంది. చూడాలి మ‌రి ఈ వార్త‌లో నిజ‌మెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement