Thursday, April 25, 2024

Big Story: ప్యాసెంజర్ ట్వీట్‌కు రెస్పాన్స్.. బస్‌ చార్జీలు స‌వ‌రించిన‌ సజ్జనార్‌..

TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా.. ఓ ప్యాసెంజ‌ర్ ట్వీట్‌తో రెస్పాండ్ అయ్యారు ఎండీ స‌జ్జ‌నార్‌. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి రూపాయి ఆర్టీసీకి కీలకమే. కానీ, ఒక ప్యాసింజర్ చేసిన ట్వీట్‌ కు స్పందించిన ఆర్టీసీ.. గతంలో రౌండ్‌ ఆఫ్‌ పేరిట పెంచిన అదనపు వసూళ్లను తగ్గించింది.

తాజాగా ఓ ప్ర‌యాణికుడు బెంగ‌ళూరు వెళ్తూ బస్సు ఎక్కాడు. టికెట్‌ రేట్ చూసి ఆశ్చర్చపోయాడు. టికెట్‌ అసలు ధర రూ.841 కాగా, చెల్లించాల్సిన మొత్తం రూ.850 అని ఉండటంతో కండక్టర్‌ను దీనిపై ఆరా తీశాడు. అసలు ధరను మించి రూ.9 అధికంగా ఎందుకు వసూలు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించాడు. ఆ మొత్తం ఎటు పోతోందని అడ‌గ‌డంతోపాటు ఇదే విషయాన్ని ట్విటర్‌లో (Twitter) టీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్‌కు పోస్టు చేశాడు.

అయితే.. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌‌కు ఈ విషయంపై స్పష్టత లేక అధికారులను అడిగి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకున్నారు. టికెట్‌ ధరలు మార్చినప్పుడు చిల్లర సమస్య రాకుండా రౌండ్‌ ఆఫ్‌ చేసే విధానం ఉందని.. దాని ప్రకారమే ఆ 9 రూపాయలు వసూలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు సజ్జనార్‌‌కు తెలియ‌జేశారు. ఇలా అదనంగా వసూలు చేయటం వల్ల ఆర్టీసీ ప్రతిష్ట తగ్గుతుందని భావించిన సజ్జనార్.. వెంటనే రేట్లను సవరించాలని ఆదేశించారు.

ఈ మేరకు అధికారులు.. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో రౌండ్‌ ఆఫ్‌ ధరను సవరించారు. గతంలో రూ.841 నుంచి రూ.850కి పెంచిన బెంగ‌ళూరు టికెట్‌ ధరను.. ఇప్పుడు రూ.840కి మార్చారు. అలాగే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కనీస చార్జీ రూ.15, దీనికి సెస్‌ రూపాయి కలిపితే రూ.16 అవుతుంది. దీనిని చిల్లర ఇబ్బంది పేరిట రూ.20గా రౌండ్‌ ఆఫ్‌ చేసి వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని కూడా రూ.15కు తగ్గించేలా స‌వ‌ర‌ణ‌లు చేశారు స‌జ్జ‌నార్‌.

ఇలా అన్ని రకాలుగా టికెట్ రేట్లలో (Ticket rates) మార్పులు చేశారు. దీంతో రోజూ సగటున రూ.10 లక్షల దాకా టికెట్లపై తెలంగాణ ఆర్టీసీ ఆదాయం కోల్పోనున్న‌ట్టు తెలుస్తోంది. అయినా ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కోల్పోతే అస‌లుకే మోసం వ‌స్తుంద‌న్న కార‌ణంగా ప్ర‌యాణికుల విశ్వాసాన్ని మ‌రింతచూర‌గొనేలా ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై అంద‌రూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement