Friday, April 26, 2024

Big Story: ఏటీఎం చార్జీల నుంచి బ్యాంకు లాకర్ల భద్రత దాకా.. కొత్త ఏడాది నుంచి చేంజెస్ ఇవే..

క‌ష్టాలు, క‌న్నీళ్లు.. సంతోషాలు.. సంబురాలు.. ఆక‌లికేక‌లు, ఆర్త‌నాదాలు.. ఇలా ఎన్నింటినో దాటుకుని మ‌రో సంవ‌త్స‌రం కాల‌గ‌ర్భంలో క‌లిసిపోనుంది.. ఇవ్వాల్టితో 2021వ సంవ‌త్స‌రం ముగియ‌నుంది. తెల్ల‌వారితే మ‌రో కొత్త ఏడాది.. కొత్త ఆశ‌ల వార‌దిగా 2022 ఉంటుంద‌ని అంతా సంబురాలు జ‌రుపుకుంటారు.. రేపు కొత్త సంవత్సరానికి వెల్​కం (New year 2022) చెప్పనున్నాం. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఆర్థికపరంగా పలు కీలక మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. మరి ఆ చేంజెస్‌ ఏమిటి? వాటి ఎఫెక్ట్ సామాన్యుల‌పై ఏమేర‌కు ఉండనుంది అనేది చ‌దివి తెలుసుకుందా..

ఏటీఎం చార్జీలు..
కొత్త సంవ‌త్స‌రం 2022 నుంచి (రేపటి నుంచి) ఏటీఎం చార్జీలు పెరగనున్నాయి. పరిమితికి మించి చేసే ఏటీఎం లావాదేవీలపై అదనపు చార్జీల భారం పడనుంది. ప్రస్తుతం పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలపై (నగదు రహిత లావాదేవీలైనా) రూ.20 చార్జి వసూల చేస్తున్నాయి బ్యాంకులు. కానీ, రేపటి నుంచి ఈ చార్జీలు రూ.21కి (ATM new Charges) పెరగనున్నాయి.

లాక‌ర్లు మ‌రింత సేఫ్‌..
రేపటి (2022 జనవరి 1) నుంచి బ్యాంక్ లాకర్లు మరింత సేప్‌గా (New bank locker rules) మారనున్నాయి. ఇకపై లాకర్ల భద్రతపై బ్యాంకుల బాధ్యతలు మరింత పెరగనున్నాయి. ఆర్​బీఐ ఇది వరకే జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల లాకర్​కు ఏదైనా హాని జరిగితే.. అందుకు బ్యాంకు బాధ్యత వ‌హించాల్సి ఉంటుంది. దోపిడీతో పాటు బిల్డింగ్‌ కుప్పకూలడం, ఫైర్ యాక్సిడెంట్‌ వంటివి జరిగినా లాకర్ల బాధ్యత ఆయా బ్యాంకులదే. దీని ప్రకారం.. సేఫ్ డిపాజిట్​ లాకర్​ వార్షిక రెంట్‌ 100 రెట్లు అధిక మొత్తానికి బ్యాంకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

పోస్టాఫీసులు..
ఇండియా పోస్ట్ పేమెంట్​ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారులకు జనవరి 1 నుంచి చార్జీల మోత మోగ‌నుంది. పరిమితికి మించి చేసే నగదు డిపాజిట్, విత్​డ్రా లావాదేవీలపై చార్జీలు పెంచుతున్నట్లు ఇదివరకే ఐపీపీబీ వెల్లడించింది. ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మూడు రకాల అకౌంట్లను ఇస్తోంది. అందులో 1. బేసిక్ సేవింగ్స్ ఖాతా. 2. సేవింగ్స్​ ఖాతా. 3. కరెంట్​ ఖాతా. కాగా, ఈ మూడు ఖాతాల్లో ప్రయోజనాలు.. నగదు డిపాజిట్​, విత్​డ్రా పరిమితులు వేర్వేరుగా ఉంటాయి. ఖాతాను బట్టి ఐపీపీబీ విధించిన పరిమితి కన్న ఎక్కువ డిపాజిట్​ చేసినా, విత్​డ్రా చేసిన చార్జీలు వర్తిస్తాయి.

ఐటీ రిట‌ర్న్‌కి ముగియ‌నున్న గ‌డువు..
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్​కం ట్యాక్స్ రిటర్ను (ఐటీఆర్​) దాఖలు (last date for ITR filing) చేసేందుకు ఇవ్వాల్టితో గడువు ముగియనుంది. గడువు తర్వాత రూ.5000 నుంచి రూ.10 వేల పెనాల్టీతో ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement